• ఇల్లు
  • ఇండెంచర్
    • చెఱకును గురించిన సంక్షిప్త చరిత్ర
    • సౌతాఫ్రికా లో గాంధీజీ
    • ఆంగ్లేయుల పాలనలో ఇండియా
    • ఇండెంచర్ టైటానిక్
    • 45 లక్షల ఇండెంచర్ సంతతితో మన అనుభందం
    • ఇండెంచర్ గ్రంథాలయం
  • యోగ్యతాపత్రములు
  • కఫాల
    • Kafala – the modern day indenture
  • పుస్తక పఠనములు
  • ఎక్కడ కొనవలెను?
Viriah Viriah
  • ఇల్లు
  • ఇండెంచర్
    • చెఱకును గురించిన సంక్షిప్త చరిత్ర
    • సౌతాఫ్రికా లో గాంధీజీ
    • ఆంగ్లేయుల పాలనలో ఇండియా
    • ఇండెంచర్ టైటానిక్
    • 45 లక్షల ఇండెంచర్ సంతతితో మన అనుభందం
    • ఇండెంచర్ గ్రంథాలయం
  • యోగ్యతాపత్రములు
  • కఫాల
    • Kafala – the modern day indenture
  • పుస్తక పఠనములు
  • ఎక్కడ కొనవలెను?

Indenture Titanic

  • Print
  • Email
  • ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ తెలిసిన ఒక అత్యంత హృదయవిదారక సంఘటన "టైటానిక్".

    కానీ మానవాళికి దీనికన్నా ఎన్నో వేల రెట్లు బాధాకరమైన, నికృష్టమైన, జరిగిన/జరుగుతున్న విషాదం ఇండియన్ షుగర్ ఇండెంచర్ (ఇండియన్ చెరకు/చక్కెర వ్యవస్థ)

    క్రీ.శ 1859 లో "షా ఆలం" అని పేరు గల ఓడ కలకత్తా నుండి మారిషస్ కి ఇండెంచరు కూలీలను మోసుకుంటూ సముద్రయానం సాగించింది. మార్గమధ్యంలో అగ్ని ప్రమాదానికి గురైన ఆ ఓడ నుండి మొత్తం 75 మంది ఓడ తాలూకు సిబ్బంది రక్షింపబడ్డారు. ఒక్కడు మినహా మిగిలిన 400 వందల మంది ఇండెంచరు కూలీలు దహనమైపోయారు.

    ఈ విషాద సంఘటన ఎక్కడా చరిత్రపుటల్లోకి ఎక్కలేదు. అక్కడక్కడా దీని గురించి మాట్లాడుకునేవారు కానీ అధికారికంగా ఎప్పుడూ ధృవీకరించబడలేదు. మరి చనిపోయిన వాళ్ళంతా పైసాకు కొరగాని బీద ఇండెంచరు కూలీలేగదా!

    ఇండియా నుండి ఇతర వలస దేశాలకు ఇండెంచరు కూలీలుగా ఓడలలో పంపబడ్డ 13 లక్షల నిస్సహాయులైన ఇండెంచరు కూలీల దుస్థితి, దుర్భరమైన ఓడ ప్రయాణాల వివరాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఈ ఇండెంచరు కూలీలను తీసుకువెళ్ళిన ఓడల్లో 60 % పైగా కలకత్తా రేవు నుండీ, మిగిలిన 40 % మద్రాసు రేవు నుండీ బయల్దేరాయి.

    చిత్రం: ఇండెంచరు ప్రయాణం

    మూలం: ఐ స్టాక్ నుండి ప్రపంచపటం

    పట చిత్రణ: యాజుషా క్రిష్ణ

    ఈ ఓడ ప్రయాణాలు, కొన్ని సార్లు నాలుగైదు నెలల వరకూ పట్టేవి. ఈ ఇండెంచరు విధానంలో కూలీల నౌకా రవాణా మొదట్లో చిన్న చిన్న కలపతో చేసిన పడవల్లో జరిగేది. కాని తరువాతి రోజుల్లో 1850 ప్రాంతాల్లో కాస్త పెద్ద నౌకలు దాదాపు 300 (మూడు వందలకు) పైగా కూలీలను తీసుకెళ్ళేవి. 1860 కొంచెం పెద్ద పడవలు ఇంకొంతమంది ఎక్కువ కూలీలను తీసుకెళ్ళేవి. కాని 1870 ల్లో ఆవిరితో నడిచే (స్టీము షిప్) నౌకలు మొదలైనప్పటినుండీ ప్రయాణ సమయం ఏభై (50 ) రోజుల్లో చేరిపోయేది.

    చాలా వరకూ ఈ ఓడల్లో ప్రయాణించే కూలీలు ప్రయాణం పొడుగునా నరకయాతన పడవలసివచ్చేది. చేపలూ గట్రా రవాణా చేసేందుకు ఉపయోగించే 4 to 5 (నాలుగయిదు) అడుగులు మాత్రమే ఎత్తున్న రెండు అంతస్తుల మధ్యన ఉన్న స్థలంలో ఈ కూలీలను కుక్కేసేవాళ్ళు. చాలా మంది కూలీలకు సరిగా ఊపిరాడక విలవిలలాడుతూ ప్రయాణించేవాళ్ళు. నెలల తరబడి చేసే ఈ ప్రయాణాల్లో కూలీల దుర్గంధంతో నిండిన

    అపరిమితమైన దుర్ఘంధంలో ప్రయాణం దుర్భరంగా ఉండేది.

    "ఉమ్ ఓటి" వంటి కూలీలను నాటాల్ చేరవేసిన ఓడల గురించి ఆ ఓడలలోని కొంతమంది డాక్టర్లు గమనించిన కొన్ని వివరాలు.

    1886 లో నాటాల్ చేరిన ఉమ్ ఓటి - ఓడలో వైద్యునిగా సేవలందించిన డా. పాటర్ సన్ మీద ఓడలో ప్రయాణించిన ఎంతోమంది స్త్రీలను చెఱచినట్లుగా 16 12 1886 నాడు మేజిస్ట్రేటు ఫిన్ మోర్ దగ్గర కేసులు నమోదయ్యాయి.

     

    (మూలం: గులాం వాహెద్ మరియు అశ్విన్ దేశాయ్ గార్ల ఇండియన్ ఇండెంచర్ - పుస్తకం)

    ఇండియన్ కూలీలు ప్రయాణించిన కొన్ని ఓడల ఫోటోలను ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

    మూలం: వికీపీడియా.

    మా ముత్తాత వీరయ్య గారు ప్రయాణించిన ఓడ పేరు "ఉమ్ కూజి". ఉమ్ కూజి చాలా పెద్ద ఓడ. దీనిలో 614 (ఆరు వందల పద్నాలుగురు) కూలీలు 6 (ఆరు) వారాలలో సౌతాఫ్రికా చేరుకున్నారు. ఈ ఇండెంచరు కూలీలను ఇండియా నుండి విదేశాలకు చేరవేసిన ఓడలలో ప్రయాణించిన కూలీలతో అన్ని కులాలకు, మతాలకు, వర్ణాలకు చెందిన భారతీయులు ఉండేవారు. వారిలో పెద్ద సంఖ్యల్లో ఉన్నవారు :- గొల్లలు, మాలలు, మాదిగలు, చాకలి, కుమ్మరి, ఉప్పరి, కాపు, బ్రాహ్మణ, సయ్యద్ లు (ముస్లింలు), రాజపుత్రులు, పఠాన్లు (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల నుంచి వచ్చిన పుష్టు భాష మాట్లాడే ముస్లింలు), కసాయులు, గానుగ నూనె వ్యాపారం చేసుకునే తేలీలు, ఇంకా కొంతమంది ఇతర కులాలవాళ్ళు వున్నారు. ఆరోజుల్లో నిమ్న వర్గాలకు చెందిన వారు ఊరికవతలగా ఉన్న చిన్న గూడేలలో ఉండేవారు (ఈ దౌర్భాగ్య స్థితి ఈనాటికీ ఇండియాలో అక్కడక్కడా కన్పిస్తూనే వుంది) వారిని అస్పృస్యులుగా, అంటరానివారిగా పరిగణించేవారు. 

    కాని ఓడల్లో ప్రయాణించేటప్పుడు ఈ వ్యవహారం కుదిరేది కాదు. బ్రాహ్మణులు, రాజపుత్రుల కులాలకు చెందిన కూలీలు నిమ్న కులాల వారితో కలిసి జీవించటాన్ని నిరసించేవారు. ఇతర కులాల వారందరూ త్రాగే నీళ్ళ డ్రమ్ముల్లో నుండి వీరు త్రాగటానికి నిరసించేవారు. అందరి కోసం వండిన ఆహార పదార్ధాలను ఆపాత్రల నుండి తినడానికి నిరాకరించేవారు. కానీ వారి అసమ్మతులు ఓడల్లో చెల్లుబాటు కాలేదు. ఓడలో ఏ కులానికి చెందినవారైనా "కూలీలు" మాత్రమే. అందరూ ఓడ అడుగుభాగంలోనే సర్దుకుని ప్రయాణం సాగించవలసివుండేది. వందల వేల సంవత్సరాల నాటి వర్ణ విచక్షణ, సామాజిక అంతరాలు ఈ ఇండెంచర్ అనే అగ్ని గుండంలో పడి భస్మమైపోయాయి. ఓడలో వీరందరిదీ ఒకటే జాతి - బీద జాతి - అన్నార్తుల జాతి - ప్రతి ఒక్కడూ సౌఖ్యమైన మంచి జీవితం కోసం తపన పడేవాడే! అదే వీళ్ళందరినీ ఒక్కటిగా చేసింది. వాఱందరూ "జెహాజీ భాయ్" లుగా (సోదర నావికులుగా) రూపాంతరం చెందారు.

    సముద్రయానంలో చాలామంది అనారోగ్యానికి గురవడం సహజం. సముద్రం మీద నుండి వచ్చే ఉప్పు నీటి గాలులు, అలవాటు లేని ఆహారం, అపరిశుభ్రమైన పరిసరాల వాళ్ళ వచ్చే అనారోగ్యాలు తట్టుకుని ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఒక్కోసారి వచ్చే ఉప్పెన గాలుల వల్ల ఎగసిపడే అలలు తట్టుకుని నిలబడవలసి ఉంటుంది. కాస్త పెద్ద వయసులో వున్న వారికి ఈ ప్రయాణం తట్టుకోవడం మరీ దుర్లభంగా ఉంటుంది. విపరీతమైన వేగంతో వీచే గాలులను తట్టుకోవడం కోసం కొంతమంది ఆసరాగా అక్కడి స్థంబాలను గట్టిగా వాటేసుకుని నిలద్రొక్కుకోవాలి. గాలులు తగ్గిన తర్వాత కూడా కొంతమంది ఆసరాగా పట్టుకున్న ఆ స్థంబాలను, గోడలను వదలి కదలరు.

    వానా, గాలీ వల్ల జరిగే కల్లోలం నుంచి బ్రతుకు జీవుడా అని బయటపడి కాస్త ఊపిరి పీల్చుకుని ఓడ శుభ్రం చేసే పనులు మొదలిపెట్టాల్సి ఉంటుంది. "డెక్" ల మీద నిలిచిన నీళ్ళను ఎత్తి సముద్రంలోకి పారబోయాల్సివుంటుంది. ఆ తరువాత మొత్తం అన్ని "డెక్" లనూ తుడిచి శుభ్రంగా పొడిగా చేయాల్సివుంటుంది. ఈ ఉప్పెనలూ, ఈదురు గాలుల వల్ల అనారోగ్యానికి గురైన వాళ్ళకి, జబ్బుపడ్డ వాళ్ళకి సరైన మందులు ఇచ్చేవాళ్ళు కాదు.ఉన్న కొద్ది పాటు మందులు కాబిన్లలో ఉండే క్లాసులో కాబిన్లలో వుండే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

    ఇలాంటి ఉత్పాతాలు వచ్చినప్పుడు చాలామంది కూలీలు మృత్యువాత పడిపోతారు. ఇక్కడ చాలా బాధ కలిగించే విషయమేమిటంటే కొన్నిసార్లు ఈ విధంగా చనిపోయిన వారి సంఖ్య దాదాపు 20 % (ఇరవై శాతం) వరకూ ఉంటుంది.

    కారబ్బీను దీవులకు కూలీలను తీసుకువెళ్ళే సందర్భాలలో ఇటువంటి 10 (పది) ఉత్పాతాలలో పోయిన వారి జాబితా ఈ దిగువ పొందుపరుస్తున్నాను.

    ఆడ కూలీలపై జరిగిన అత్యాచారాల వల్ల ఎంతోమంది గర్భవతులవ్వడం చాలా మామూలు విషయంగా ఉండేది. పుట్టిన బిడ్డకానీ, తల్లికానీ, ఇంకా ఏ విధమైన ఇతర కారణాల వల్ల గానీ చనిపోయిన వారి శవాలను నిర్దాక్షిణ్యం ఏ అర్ధరాత్రి వేళల్లోనో, అపరాత్రి వేళలోనో సముద్రంలో పడవేశేవారు. చనిపోయిన వారికి ఏ విధమైన కర్మ కాండలూ జరిపే అవకాశమే ఉండేది కాదు.

    సంబంధిత ప్రభుత్వాలు ఈ ఇండెంచరు వ్యవస్థను 1917 లో రద్దు చేశాయి.

    కాలక్రమేణా ఈ పాతకాలపు పడవలు, ఓడల స్థానంలో స్టీము షిప్పులు(ఆవిరి యంత్రాలతో నడిచే ఓడలు) వచ్చేసాయి. వేగంగా ప్రయాణించగలిగే వీటి వల్ల ప్రయాణ సమయం చాలా తగ్గిపోయింది. ఓడ ప్రయాణాల్లో వచ్చే వ్యాధులు, ఇంకా మరణాల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. కానీ ఆనాటి ఇండెంచరు కాలంలో జరిగిన హృదయ విదారకమైన చరిత్రను ప్రక్షాళన చేయగలమా?

    share with Whatsapp
    share with Telegram
    Save on Delicious
    Send by email
    Share in Reddit
    • రచయిత గురించి
    • |
    • మమ్ములను సంప్రదించండి